యుగయుగాలు మారిపోనిది
తరతరాలు తరిగిపోనిది
ప్రియ యేసు రాజు నీ ప్రేమా
నిను ఎన్నడు వీడిపోనిది
నీకు ఎవ్వరు చూపలేనిది
ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది
హద్దే లేని ఆ దివ్య ప్రేమతో
కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో
నీ కోసమే బలి అయిన దైవము రా (2)
లోకంతో స్నేహమొద్దు రా
చివరికి చింతే మిగులు రా
పాపానికి లొంగిపోకు రా
అది మరణ త్రోవ రా (2)
నీ దేహం దేవాలయము రా
నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే||
తను చేసిన మేలు ఎట్టిదో
యోచించి కళ్ళు తెరువరా
జీవమునకు పోవు మార్గము
క్రీస్తేసుని ఆలకించారా (2)
నీ ముందర పందెము చూడరా
విశ్వాసపు పరుగులో సాగరా (2) ||హద్దే||