యేసు జననము లోకానికెంతో వరము
ఆనంద గానాల క్రిస్మస్ దినము (2)
ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2)
బెత్లెహేములో పశులపాకలో
పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2)
పవళించినాడు ఆనాడు
నీ హృదిని కోరాడు నేడు (2) ||ఆహాహహా||
గొల్లలంతా పూజించిరి
జ్ఞానులంతా ఆరాధించిరి (2)
అర్పించుము నీ హృదయం
ఆరాధించుము ప్రభు యేసున్ (2) ||ఆహాహహా||