యేసే నా ఊపిరి – యేసే నా కాపరి
నీ సేవే నాకు భాగ్యం
నీ సన్నిధే నాకు శరణం (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన
పాపపు ఊబి నుండి
పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు
వెలుగైన నా దేవా (2)
నీ ఆత్మయే నాకాదరణ
నిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన||
పక్షి రాజు యవ్వనం వలె
నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము
నాకు కనపరచిన ప్రభువా (2)
విశ్వాసమే నాదు సూత్రం
ప్రార్ధనే నాకు విజయం (2) ||ఆరాధన||