యేసయ్యా నా యేసయ్యా Song Lyrics

యేసయ్యా నా యేసయ్యా
నాపై నీకెందుకింత ప్రేమయ్యా (2)
నా పాపములను క్షమియించినావయ్యా
నా దోషమును భరియించినావయ్యా
నీ ప్రేమకు కొలతే లేదయ్యా
నా దాగు చోటు నీవయ్యా (2) ||యేసయ్యా||

ఆజ్ఞను వినని అవిధేయత
నీ సన్నిధి నుండి తొలగించనీ (2)
ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా
ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా (2) ||యేసయ్యా||

లోకపు ఆశతో నిండియుండగా
జీవపు ఢంబము మదిని చేరగా (2)
చెడిపోయి నేను తిరిగి రాగా
నా రాకకై దారిలో వేచియుంటివి (2) ||యేసయ్యా||

యేసయ్యా నా యేసయ్యా telugu christian video song