యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా (2) ||యేసయ్యా||
మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా (2)
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట (2) ||యేసయ్యా||
నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా (2)
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట (2) ||యేసయ్యా||
నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా (2)
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా (2) ||యేసయ్యా||