Today’s Promise of God in Telugu | Pastor Ramesh | Today’s Word of God | Telugu Bible Messages | Telugu Christian Messages | Daily Word
సెప్టెంబర్, 11
*అనుదిన నిత్యజీవపు మాటలు* ?
☦
“తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే”
_యాకోబు 1: 27_
?
మనమందరము *దేవునియందు* భయభక్తులు కలిగి జీవించాలి.
అలా భక్తి గలిగి జీవించాలంటే, మన పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలి. అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి.
మనలను ప్రేమించిన వారిని ప్రేమించుట, మనకు సహాయము చేయు వారికి సహాయము చేయుట నిజమైన ప్రేమ కాదు. *దేవుని* యెదుట _నిష్కళంకమైన పవిత్రమైన_ ప్రేమ యేదనగా తిరిగి మనకు యేమియు సహాయము చేయలేని వారిని కూడా ప్రేమించుటయే!
*దేవుడు* దిక్కులేని పిల్లల పక్షమునను విధవరాండ్ర పక్షమునను నాయకర్తయై ఉన్నారు. ఆమేన్. ఆయన బిడ్డలుగా మనము కూడా వారియెడల ప్రేమ కలిగి, వారి పక్షమున నిలువబడి, వారి యిబ్బందులలో పరామర్శిస్తూ, వారికి చాతనైనంత సహాయము చేస్తూ ఉండాలి. ఆమేన్, హల్లేలూయా.
ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా జాగ్రత్తపడుచూ *దేవునికి* మహిమ తెచ్చు బిడ్డలుగా ఈ లోకములో జీవించాలి.
ఇదియే *దేవుని* దృష్టికి నిజమైన భక్తి. అట్టి కృప *దేవుడు* మనకు దయచేయును గాక. ఆమేన్.
? ప్రార్ధన: చిన్న పిల్లలను విధవరాండ్రను ఆదరించిన *ప్రభువా,* మీకు వందనములు. మీ యందు భయభక్తులు కలిగి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ప్రేమించి మాకు చేతనయినంత సహాయము వారికి చేయునట్లు అనుగ్రహించమని *ప్రభువైన యేసుక్రీస్తు* ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రియైన *దేవుని* నుండియు మన ప్రభువైన *క్రీస్తుయేసు* నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగును గాక. ఆమేన్.
*పరిశుద్ధదేవుని మందిరము* ?
Church of the Holy One
2nd Floor, DMart Road, Opp. ICICI Bank, Beside Bheemreddy Sweet Shop, Sanathnagar, Hyderabad – 500018, India
Timings:
Sunday Worship 10.00 AM, Saturday Youth Meeting 7.00 PM, Friday Fasting Prayer 7.00 PM (All Services in Telugu)
https://www.youtube.com/channel/UC3rD8uxBDVEBduHT-Fucwiw
Email: brotherramesh@gmail.com
https://www.facebook.com/brotherramesh.k
https://www.facebook.com/brotherramesh1/?modal=admin_todo_tour
source