త్రిత్వైకమా Song Lyrics

త్రిత్వైకమా సకలేశ్వరా
పూజ్యుడౌ శ్రేయస్కరా (2)
ధ్యానించెద హృది వాంఛతో
గళమెత్తెద మృదు భాషతో
నా సుతుడా సర్వే సుతుడా
నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా||

దోష భావముకు బంధునవ్వగా
దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2)
వాక్యపు వెలుగై నాకిల వెలుగై
ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||

క్షితియందు ఎరకు మోసిపోతిని
క్షమలేక ఇలలో మృతమైతిని (2)
వెల దాతవై జీవ దాతవై
స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||

త్రిత్వైకమా telugu christian video song


త్రిత్వైకమా Song Lyrics