తేనెకన్న తీయనైనది
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||
ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||
నా వాళ్ళే నన్ను విడిచినా
నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||