తప్పిపోయిన కుమారుడనయ్యా Song Lyrics

తప్పిపోయిన కుమారుడనయ్యా
తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా
కాదనకయ్యా నా కన్న తండ్రి
తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2)

అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని
పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2)
ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా
ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా||

పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు
పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2)
ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా
తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా||

తప్పిపోయిన కుమారుడనయ్యా telugu christian video song