స్తుతి నీకే యేసు రాజా Song Lyrics

స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2)
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు (2)
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (2) ||స్తుతి||

మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా||

సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైనా శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము ||హోసన్నా|| ||స్తుతి||

స్తుతి నీకే యేసు రాజా telugu christian video song


స్తుతి నీకే యేసు రాజా Song Lyrics