సిలువలో నీ ప్రేమ Song Lyrics

సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో||

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని||

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని||

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని||

సిలువలో నీ ప్రేమ telugu christian video song