శృతిచేసి నే పాడనా Song Lyrics

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామీ (2)
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా హల్లేలూయా
హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2) ||శృతిచేసి||

దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3) ||హల్లేలూయా||

శృతిచేసి నే పాడనా telugu christian video song


శృతిచేసి నే పాడనా Song Lyrics