సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా(2)
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతసముగ నిను పొగడెదను(2)
హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా||
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా||
మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా||
భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి(2) ||హల్లెలూయా||
ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై (2)
హేతువు లేకయే ప్రేమించెన్
యేసుకు నేనేమివ్వగలన్(2) ||హల్లెలూయా||