సంపూర్ణుడా నా యేసయ్యా Song Lyrics

సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా (2)
నా యందు పరిపూర్ణత కోరితివే (2)
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||

ఉపదేశించుటకు నను ఖండించుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు (2)
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||

ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2)
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని (2)
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే (2) ||సంపూర్ణుడా||

సంపూర్ణుడా నా యేసయ్యా telugu christian video song

సంపూర్ణుడా నా యేసయ్యా Song Lyrics