రక్షకుడు వచ్చినాడు Song Lyrics

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2)
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2)

ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2)
బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం||

వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2)
వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||

రక్షకుడు వచ్చినాడు telugu christian video song


రక్షకుడు వచ్చినాడు Song Lyrics