రాగము తాళములో మారుమ్రోగెడి గంటలలో
ప్రతి ద్వనియించేను శృతి నాదములతో (2)
కలువరి తొలి పలుకూ ||రాగము||
1. కృప జూపుచు నను – పిలచెను సిలువలో (2)
నెపములు చెప్పుచునె – నెడదృోసితి కరుణన్
||రాగము||
2. నీ పాపభారము – నాపై మోపని(2)
కరములు చాపె ప్రభో – కాదని త్రోసితిని
||రాగము||
3. కలువరి మాటలు – విలువైన ఊటలు (2)
సిలువను చేరుసుమీ – నలిగిన హృదయముతొ
source
