రాకడనే రైలు బండి Song Lyrics

రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది ||రాకడనే||

సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే||

ప్రతి దినము బైబిలును పఠియించుము
ప్రార్దననెడి విజ్ఞాపన వివరించుము – ప్రభుకి వివరించుము
ఎదురు వీచే గాలులనెడి వ్యాధి బాధలన్
సాతాను చిక్కులను యేసు రక్తమందు కడిగి
జయము పొందుము – పవిత్రుడవు కమ్ము ||రాకడనే||

తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు యెహోవాండి (2)
పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు
సిలువ జెండా ఎత్తి చూపి బండి నిలుపుము – నీవు ప్రవేశించుము ||రాకడనే||

రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) ||రాకడనే||

పాపులున్న స్టేషనులో బండి ఆగదు (2)
పరిశుద్ధుల స్టేషనులో
బండి ఆగును – రైలు బండి ఆగును (2) ||రాకడనే||

రాకడనే రైలు బండి telugu christian video song


రాకడనే రైలు బండి Song Lyrics