Psalms Chapter 1 ( కీర్తనల గ్రంథము) || Telugu Audio Bible ||


Psalms Chapter 1 ( కీర్తనల గ్రంథము) || Telugu Audio Bible ||

Psalms Chapter 1 ( కీర్తనల గ్రంథము) || Telugu Audio Bible ||

1. దుష్టుల ఆలోచనచొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

3. అతడు నీటికాలువల యోరను నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును
అతడు చేయునదంతయు సఫలమగును.

4. దుష్టులు ఆలాగున నుండక
గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

5. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును
నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును
దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

Telugu Audio Bible Channel
https://www.youtube.com/channel/UCjhpQvOAPscWHHxa-ib0MRA

Telugu Audio BIBLE, Audio Bible Telugu, Bible old testament Telugu, Holy Bible, bible audio in Telugu, Bible Audio Telugu, Audio Bible, parishudha grandham bible Telugu, keerthanalu grandham, keerthanalu, keerthanalu telugu bible audio

source