ప్రేమించు దేవుడు Song Lyrics

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు||

తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు
తోడు నీడగా నన్ను కాపాడును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు
సర్వ కాలమందు జయమిచ్చును (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు
అంతము వరకు చేయి విడువడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||

ప్రేమించు దేవుడు telugu christian video song


ప్రేమించు దేవుడు Song Lyrics