ప్రేమగల యేసయ్యా Song Lyrics

ప్రేమగల యేసయ్యా
జీవ వృక్షమా యేసయ్యా (2)
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా (2)
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల||

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను (2)
నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా||

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా (2)
ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా||

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే (2)
మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా||

ప్రేమగల యేసయ్యా telugu christian video song


ప్రేమగల యేసయ్యా Song Lyrics