ప్రతి రోజు చూడాలని Song Lyrics

ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||

పరలోకమందున పరిశుద్ధ దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)
జీవ జలము యొద్దకు నడిపించును
ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||

ఆకాశమందున రారాజుగా వచ్చును
భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)
కడబూరధ్వని వినిపించును
పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||

ప్రతి రోజు చూడాలని telugu christian video song


ప్రతి రోజు చూడాలని Song Lyrics