ప్రభుని గృహము ఆయన మహిమతో
పరిపూర్ణముగా నిండెను (2)
అపరాధములచే ప్రజలందరును
దేవుని మహిమను కోల్పోయిరి (2)
తన మహిమను మన కిచ్చుటకు (2)
యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని||
కృపా సత్యములు సంపూర్ణముగా
మన మధ్యలో వసించెను (2)
తండ్రి మహిమను తన సుతునిలో (2)
మనమందరము చూచితిమి (2) ||ప్రభుని||
ప్రభువు యింటిని నిర్మించు చుండె
సజీవమైన రాళ్ళతో (2)
ఆయన మహిమ దానియందుండ (2)
తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని||
శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు
మానవ హస్తము అందుండదు (2)
క్రయమునిచ్చి స్థలముకొనెను (2)
తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని||
ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి
తన పునాదిని వేసెను (2)
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2)
ప్రభువే సర్వము చేసెను (2) ||ప్రభుని||
సింహాసనముపై కూర్చున్న ప్రభువే
అణగ ద్రొక్కెను శత్రువును (2)
సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2)
వెలిగించెను తన యింటిని (2) ||ప్రభుని||
దేవుని యిల్లు ముగించబడగా
పైనుండి అగ్ని దిగివచ్చున్ (2)
దహించబడును సర్వ మలినము (2)
ఇంటిని మహిమతో నింపును (2) ||ప్రభుని||