ప్రభు మొర వినవా Song Lyrics

ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు||

నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా (2)
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే||

ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2)
చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే||

మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే (2)
స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||

ప్రభు మొర వినవా telugu christian video song


ప్రభు మొర వినవా Song Lyrics