ప్రభు హస్తం నాపై నుంది
రవ్వంతయూ భయమే లేదు (2)
ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్
అంతము వరకు నడిపించును (2) ||ప్రభు||
తినిపించును నన్ను లాలించున్
విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు||
రక్తముతో శుద్ధి చేయును
రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు||
అపహరింపలేరండి
ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు||
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)