పొందితిని నేను Song Lyrics

పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)

జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)
ఇంత వరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని||

గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)
అంధకార శక్తుల ప్రభావమునుండి (2)
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)
నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని||

కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)
నను చేరదీసి ఓదార్చితివే (2)
భయ భీతి నిరాశల యందున ప్రభువా (2)
బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని||

నా దేహమందున ముళ్ళు నుంచితివి (2)
సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2)
వ్యాధి బాధలు బలహీనతలందు (2)
నీ కృపను నాకు దయచేసితివి (2) ||పొందితిని||

నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2)
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2)
కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2)
జయజీవితము నాకు నేర్పించితివి (2) ||పొందితిని||

పొందితిని నేను telugu christian video song


పొందితిని నేను Song Lyrics