పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు (4)
ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2) ||పదివేలలో||