పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2)
నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య ||పదే పాడనా||
ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం ||పదే పాడనా||
మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం ||పదే పాడనా||