పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా||
ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును (2)
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా||
దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు (2)
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా||
నా ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును (2)
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||