ఊహకు అందని కార్యముల్
ఊహించని రీతిలో నాకై చేసిన దేవా
ఊహకు అందని వేళలో
ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా
ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్
నీదు నామ గీతము నాదు జీవితాంతము
కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||
కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు
ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)
అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను
అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము
అసాధ్యమైనదేది నీకు లేనే లేదు
ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి||
బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా
ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా
కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు
నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||