నూతన హృదయము Song Lyrics

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును ||నూతన హృదయము||

నూతన హృదయము telugu christian video song


నూతన హృదయము Song Lyrics