నిను గాక మరి దేనిని Song Lyrics

నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2)
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు ||నిను గాక||

నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా
నా యేసువా – నా యేసువా ||నిను గాక||

రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో
ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే
నా యేసువా – నా యేసువా ||నిను గాక||

నిను గాక మరి దేనిని telugu christian video song


నిను గాక మరి దేనిని Song Lyrics