నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా (2)
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల||
సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా (2)
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల||
సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా (2)
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||