నీవు చేసిన మేళ్లకు Song Lyrics

నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా (4)

ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు (2) ||వందనం||

బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||

నీవు చేసిన మేళ్లకు telugu christian video song


నీవు చేసిన మేళ్లకు Song Lyrics