నీతోనే నే నడవాలని
నీలోనే నే నిలవాలని
నీవలె నే మారాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని (2)
(నా) మదిలోని కోరిక నా యేసయ్యా
నే నీతోనే ఉండాలని (2)
నీతో నీతో నీతో నీతో
నీతో నీతో నీతో (2) ||నీతోనే||
దవళవర్ణుడా రత్న వర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా (2)
సువర్ణ వీధులలో నీతోనే నడవాలని
నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో||
కీర్తనీయుడా పూజ్యనీయుడా
స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2)
ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని
నా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||