నీతోనే గడిపేయాలని Song Lyrics

ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్
ప్రెయిస్ హిం ఇన్ ద నూన్
ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్
ప్రెయిస్ హిం ఆల్ ద టైం

వేకువనే నా దేవుని ఆరాధింతును
ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)
నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని
నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2)

నను నడిపించే దైవమా
నాతో నిలిచే కేడెమా (2)
ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును
నీ కార్యముల చేత నన్ను
తృప్తి పరచి సంతోషమే ||నా ప్రాణం||

నను కరుణించు బంధమా
నను బలపరచి ధైర్యమా (2)
కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్
నిను విడచి క్షణమైనా
నే బ్రతకలేను ఇలలో ||నా ప్రాణం||

నీతోనే గడిపేయాలని telugu christian video song


నీతోనే గడిపేయాలని Song Lyrics