నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు||
పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా||
ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||