నీ స్నేహము Song Lyrics

నీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము (2)
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా (2)
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా (2)

సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక (2)
కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపే
నన్నెరిగిన నా తండ్రివి ||నా సఖుడా||

గొల్యాతయినా ఏ యుద్ధమైనా
విజయము నిచ్చిన వీరుడవు
పదివేలమంది నా వైపు కూలినా
నాతో నిలచిన ధీరుడవు (2)
నా దోశములను నీదు రక్తముతో
తుడిచివేసిన పరిశుద్ధుడవు ||నా సఖుడా||

ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవు
అందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2)
నిస్సారమైన నా జీవితములో
సారము పోసిన సజీవుడవు (2) ||నా సఖుడా||

నీ స్నేహము telugu christian video song


నీ స్నేహము Song Lyrics