నీ ప్రేమ నా జీవితాన్ని –నీకై వెలిగించెనే యేసయ్యా
నీ కృప సెలయేరులా –నాలో ప్రవహించెనే (2)
నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే
నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2)
నేను నిన్ను విడచిననూ –నీవు నన్ను విడువలేదయ్యా
దారి తప్పి తొలగిననూ –నీ దారిలో నను చేర్చినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ప్రేమను (2) ||యేసయ్యా||
జలములు నన్ను చుట్టిననూ –నీ చేతిలో నను దాచినావయ్యా
జ్వాలలు నాపై లేచిననూ –నీ ఆత్మతో నను కప్పినావయ్యా (2)
ఏమివ్వగలను నీ కృపకు నేను
వెలకట్టలేను నీ ఆత్మను (2) ||యేసయ్యా||