నీ పాదాలు తడపకుండా Song Lyrics

ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||

ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||

ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||

నీ పాదాలు తడపకుండా telugu christian video song


నీ పాదాలు తడపకుండా Song Lyrics