నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని (2)
బలు రక్కసి వృక్షపు గాయములు (2)
ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు||
నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి (2)
నీ శిరము వానకు తడిచినను (2)
నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు||
నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి (2)
ద్రాక్షా రస ధారల కన్న మరి (2)
నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు||
ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)
నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు||