నీ చల్లని నీడలో
నీ చక్కని సేవలో (2)
నా బ్రతుకు సాగనిమ్మయ్యా
యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని||
కష్టాలు ఎన్ని వచ్చినా
వేదనలు ఎదురైనా (2)
నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు
నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని||
ఏర్పరచబడిన వంశములో
రాజులైన యాజకులుగా చేసితివి (2)
పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా
నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని||