నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా (2)
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే (2)
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా …
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2)
బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2)
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2)
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||