నన్నెంతగానో ప్రేమించెను Song Lyrics

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||

సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||

సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||

కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత||

ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||

నన్నెంతగానో ప్రేమించెను telugu christian video song


నన్నెంతగానో ప్రేమించెను Song Lyrics