నన్నాకర్షించిన నీ స్నేహ బంధం Song Lyrics

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన నీకే యేసయ్యా (2)
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||

మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు (2)
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||

చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు (2)
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం telugu christian video song


నన్నాకర్షించిన నీ స్నేహ బంధం Song Lyrics