నా ప్రాణమా సన్నుతించుమా
పరిశుద్ధ నామమున్
ఎన్నడూ లేని రీతిగా
ఆరాధించు ఆయనను
వేకువ వెలుగు తేజరిల్లును
మరలా నిన్ను కీర్తించే తరుణం
గతించినదేమైనా ముందున్నది ఏదైనా
స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా||
ఉన్నత ప్రేమతో విసుగు చెందక
గొప్పవాడవు దయగల దేవా
నీ మంచితనముకై స్తుతియింతును
ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను ||నా ప్రాణమా||
నా శరీరము కృశించు ఆ దినము
జీవిత గడువు సమీపించినా
కొనసాగించి కీర్తించుచుండ
నిత్యము నిత్యము కీర్తింతును ||నా ప్రాణమా||