నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి –నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా||
దేవాలయ విగ్రహముల్ –దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా||
ఆదియంత రహితుడ –ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా||
పరిశుద్ధ యవతరుడా –మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా||
భూతలమునకు వేంచేసి –పాతకుల ప్రేమించితివి (2)
పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా||
ఆద్యంతము లేనట్టి –బీదలకు ధన నిధీ (2)
సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా||
హల్లెలూయ గీతమును –ఎల్లెడల చాటించెదను (2)
ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||