నా దేవుని గుడారములో Song Lyrics

నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2)
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2)
నా యేసుని నివాసములో (2) ||నా దేవుని||

సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2)
నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2)
నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని||

నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2)
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2)
నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని||

ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2)
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2)
నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||

నా దేవుని గుడారములో telugu christian video song


నా దేవుని గుడారములో Song Lyrics