నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే
యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును||
నాలో నీ సన్నిధి ఉందని
గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
నా దేహమును భయముతో భక్తితో
నీ కొరకు పరిశుద్ధముగా దాచెద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము ||నా దేహమును||
నీ జీవ ప్రవాహము ప్రవహించనీ
నాలోని అణువణువు చిగురించును
ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను
విస్తారముగా దేవా ఫలియింతును
నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు ||నా దేహమును||