నా ఆశల పల్లకి Song Lyrics

నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా (2)

ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2)
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని (2)
దాహము తీర్చావని ||యేసయ్యా||

దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2)
నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని (2)
తోడుగ ఉన్నావని ||యేసయ్యా||

స్నేహితులు లేరని – తోడెవరు రారని
నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2)
నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా (2)
ఆదరించావయ్యా ||యేసయ్యా||

నా ఆశల పల్లకి telugu christian video song


నా ఆశల పల్లకి Song Lyrics