మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము||
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే (2)
దీవారాత్రులు దేవుడే కాయును ||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్ (2)
నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము||
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)
ఏ ఘడియైనను విడువక కాయును ||మేము||
బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి (2)
పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము||
కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు (2)
కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము||
జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ (2)
దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము||
ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్ (2)
మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||